![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -531 లో..... భద్రవతి తన కుటుంబంతో సహా రామరాజు ఇంటికి వస్తుంది. రామరాజు కుటుంబం ఇంటికి వచ్చిన భద్రవతి వాళ్ళకి దగ్గర ఉండి స్వాగతం పలుకుతారు. తిరుపతి వాళ్ళకి నీళ్లు ఇవ్వమని రామరాజు అనగానే ఒరేయ్ నువ్వు ఈ ఇంట్లో పనిమనిషివా.. నీళ్లు ఇవ్వరా అని సేనాపతి అంటాడు. దాంతో రామరాజు నీళ్లు ఇస్తాడు. భద్రవతికి వేదవతి వాటర్ ఇచ్చి కాళ్ళు కడుగుతుంది. పని వాడితో లేచిపోయి కాళ్ళు కడిగినా పోని పాపం చేసావని సేనాపతి అనగానే ఏంటి మామ ఇంటికి సేఫ్ గా వెళ్లాలని లేదా అని ధీరజ్ అంటాడు.
ఒరేయ్ గొడవలు వద్దు బర్త్ డే చేసుకొని వెళదామని భద్రవతి అంటుంది. ఒరేయ్ చిన్నోడా కొంచెం ఓపిక పట్టు రా అని వేదవతి అంటుంది. వేదవతి సంతోషానికి అవధులు లేకుండా పోతాయ్.. అక్క ఈ చీరలు బాగున్నాయి.. నీకు ఈ కలర్ అంటే ఇష్టమని తీసుకున్నానని భద్రవతికి చెప్తుంది. వేదవతి తన చిన్నప్పటి విషయలు గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతుంది. ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకొని ఏడుస్తారు. ఆ ఒక్క తప్పు చెయ్యకపోయి ఉంటే బాగుండేవాళ్ళమని భద్రవతి అనుకుంటుంది. మరొకవైపు మగవాళ్ళు అందరు హాల్లో కూర్చొని ఉంటారు. ధీరజ్, సాగర్ , చందు వంక విశ్వ చూస్తాడు. వాళ్ళు తన వంక కోపంగా చూస్తారు. ఆ తర్వాత తిరుపతి వచ్చి.. బావ మీరు మాట్లాడుకోండి అని అంటాడు. కానీ అందరు సైలెంట్ గా ఉంటారు. ఒరేయ్ ధీరజ్ మీ మామ పక్కన కూర్చోరా అని ధీరజ్ ని సేనాపతి పక్కన కూర్చోపెడతాడు తిరుపతి.
అప్పుడే ప్రేమ అందరికి కాఫీ తీసుకొని వస్తుంది. నాన్న ప్లీజ్ తీసుకోండి అని ప్రేమ రిక్వెస్ట్ చెయ్యడంతో సేనాపతి తీసుకుంటాడు. మరొకవైపు ఆడవాళ్లు అందరు కిచెన్ లో ఉంటారు. భద్రవతికి నచ్చినవి అన్ని వేదవతి తినమని ఇస్తుంది. మా అక్కకి నేనంటే చాలా ఇష్టం వంట రాకపోయినా ఏం అనేది కాదు.. ఎలా ఉన్నా తినేది అని వేదవతి అంటుంది. మీరు నాలాగేనా వంట రాదా అని నర్మద తనని ఆటపట్టిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |